Tuesday 4 October 2016

Image result for st.francis of assisiఇటలీ దేశపు పాలక పునితులు మరియు కతోలిక ఆధ్యాత్మిక చరిత్రలో " మరో క్రీస్తు" గా పిలువబడుతున్న పూనీత అసిస్సీపుర ఫ్రాన్సిస్ వారి పండుగదిన శుభాకాంక్షలు. " సకల సృష్టి భగవంతుని అద్భుతం. అందులో అందరము అన్నధమ్ములమే-అక్కచెల్లెల్లమే" అన్న ఆయన పలుకులను ఆస్వాదిస్తూ ఆనందంగా ఈ జీవితాన్ని ప్రభువునకు అర్పించుకున్దాం. ఫ్రాన్సిస్ వారి సభకు చెందిన ప్రతిఒక్క గురు-కన్యాస్త్రీలకు, మా తరుపున అభినందనలు మరియు శుభాకాంక్షలు.

Thursday 22 September 2016

ఆహ్వానము

రోమ తెలుగు సంఘ మొదటి సమావేశము

తారీఖు: 22-10-2016
స్థలం: పునీత పేతురు వారి కళాశాల నందు

సమయము: ఉదయం 9- సాయంత్రం 4 గంటల వరకు
దివ్యబలిపూజ: 9:30 గంటలకు
సమావేశము: 11 గంటలకు
విందు: 12 గంటలకు.

కలిసుంటే కలదు సుఖం - కమ్మని కలలకు శ్రీకారం. మీ రాకతో ఆనందాన్ని విరజిమ్మి, ఆహ్లాదంతో కలగలిసి, నూతనవిధ్యాసంవత్సరాన్ని ఒక మరపురాని, మరువలేని, మారలేని అనుభూతిగా ఈ స్నేహపూర్వక కూడికను తీర్చిదిద్ధగలరని, జయప్రధం చేయగలరని భావిస్తు ప్రార్ధిస్తున్నాము. మేము తలపెట్టు ఈ మొదటి కూడికను ఆశీర్వదించగలరని ఆశిస్తున్నాము. నూతనంగా రోము నగరమునకు వచ్చిన తెలుగు గురుకన్యాస్త్రీలను మీ వెంట తీసుకురాగలరని వేడుకొంటున్నాము.

ఇట్లు,
రోమ తెలుగు సంఘ కార్యవర్గం.

Wednesday 1 June 2016

చిగురించిన ఆశలతో, వికసించిన మనసులతో, వెళ్ళుదము ఊహలతో, జూన్ నెలలోకి.
ఎన్నోకోరికలు, మరెన్నో ఆశయాలతో, పరీక్షల ప్రపంచంలో పరుగిడుదాం ప్రభునితో.
ఊహల ఉద్దేశాలని, ఊపిరిగా చేసుకుని, ఊరేగుదాం ఉప్పెనలా........
మన కళలు కన్నీరు కాక, కార్యోదయమవ్వాలని కోరుకుంటూ , ప్రేమతో, మీ ఇమ్మానుయేలు. నండూరి.

Monday 23 May 2016

గురుపట్టాభిషేక వార్షికోత్సవము

 నీ తల్లి ఘర్బమున నిన్ను రూపొందించక మునుపే, నేను నిన్ను ఎంనుకొంటిని.

ప్రియమైన రెవ. ఫాదర్ ప్రవీణ్ అడ్డగట్ల గారికి, గురుపట్టాభిషేక వార్షికోత్సవము సందర్భమున, రోమ తెలుగు సంఘము హ్రుదయపూర్వక అభినందనలు మరియు ఆనందమును వ్యక్తపరస్తున్నది. ఆ దేవుడు మిమ్మల్ని ధారాళంగా ఆశీర్వదించి, గురు జీవితములో మీకు ఎల్లవేళల పరిశుద్ధాత్మ అనుగ్రహాలను ప్రసరించవలసిందిగ కోరుకుంటున్నది.

Sunday 22 May 2016

పుట్టిన రోజు శుభాకాంక్షలు

రెవ. బ్రదర్, జూలియస్ బాల గారికి పుట్టిన రోజు సందర్భంగ, రోమునగర తెలుగు సంఘ సభ్యులు, ప్రభువైన ఏసుక్రీస్తు దీవేనలు, మా అందరి ప్రార్థనలు మీకు ఏళ్ళవేళల తోడుగ, నీడగ, అండగ, దండుగ, మెండుగ, నిండుగ, వుండాలని మనస్పూర్థిగా కోరుకుంటున్నాము.