Saturday, 24 December 2011
Thursday, 15 December 2011
Doctoral Defense of Fr.Balaswamy Dara on 22 December 2011
Dear brothers and sisters,
Greetings from Telugu Sangham!
Difesa Dissertazione di Dottorato in Teologia
con specializzazione in teologia Spirituale
The Bhagavad Gita and the Gospel of John: threefold path of spiritual union with God
Fr. Balaswamy Dara
Moderator: Prof. Benedict KANAKAPPALLY, ocd
Esaminatori: Prof. Moriconi BRUNO, ocd, Prof. Pasquetto VIRGILIO, ocd
on 22 December 2011, ore 16.00 - Aula 1
Teresianum Pontificia Facoltà Teologica Pontificio Istituto di Spiritualità
Let us wish Fr. Balaswamy Dara ALL THE BEST!
Thursday, 1 December 2011
Advent Reflections
Dear Friends,
May I invite you to follow the following blog (Click on GO!)
for the Advent Reflections, both in English and Telugu.
God bless you!
Fr. Praveen Kumar Gopu, OFM Capuchin, ROME.
Monday, 17 October 2011
Doctoral Defense of Fr. Chatla Mariadas
Dear Brothers and Sisters,
Thanks for your presence and prayers on the day of Defense. Telugu Sangham, Rome gratefully acknowledges your support for the success of the program.
We take this occasion to express Hearty Congratulations to Fr. Chatla Mariadas for his success and wish him all the best in his ministry (Ph. 0039- 0143 830 113
Cell. 0039-335 5918823).
God bless you and have a Blessed day.
Love and Prayers,
Fr. Sudhakar Lawrence OFM Cap.
President, Telugu Sangham
Fr. Anandarao Mekala
Secretary
Thanks for your presence and prayers on the day of Defense. Telugu Sangham, Rome gratefully acknowledges your support for the success of the program.
We take this occasion to express Hearty Congratulations to Fr. Chatla Mariadas for his success and wish him all the best in his ministry (Ph. 0039- 0143 830 113
Cell. 0039-335 5918823).
God bless you and have a Blessed day.
Love and Prayers,
Fr. Sudhakar Lawrence OFM Cap.
President, Telugu Sangham
Fr. Anandarao Mekala
Secretary
Wednesday, 25 May 2011
Tuesday, 24 May 2011
Monday, 23 May 2011
తెలుగు సంఘ సమావేశం, 23 మే 2011
సమయం: 5 గంటల నుండి 8 గంటల వరకు
పునీత చిన్నప్పగారి గురునివాసము, రోమానగరము – ఇటలీ
Welcome: The Bishops of Andhra pradesh arrived St. Paul's College at 5.40. pm, Rome and were warmely welcomed by the members of Telugu Sangham. They were led to the Prayer hall and the Prayer Session began at 6.15.
ప్రార్థన కార్యక్రమము
1. ఉపోద్గాతము
''సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము'' (కీర్తన 133:1). ''పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమైయున్నలాగున వారును ఏకమై యుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము'' (యోహాను 17:11).
ప్రియ సహోదరీ సహోదరులారా! ఈ వేళలో మనం సమావేశము కావటం భగవంతుని ఏర్పాటు. ప్రభు క్రీస్తు ప్రార్థించినట్లు, సహోదరుల ఆలంబన, ఐక్యత, సంఘ శ్రేయస్సుకు ఎంతో ఆవశ్యకరము. తెలుగు క్రైస్తవ బిడ్డలు ఎక్కడ కలిసిన, దైవ రాజ్యస్థాపనకై అనుబంధాలు ఏర్పరచుకోవాలని ఈ ప్రార్థన కూడికలో ప్రార్థన చేయుదము. కార్యక్రమములో మొదటిగా, జ్యోతిప్రజ్వళన వుంటుంది. మన ప్రియతమ మేత్రాణులు ఒకుమ్మడిగా వచ్చి వత్తులను ముట్టించి ప్రార్థనను ప్రారంభిస్తారు.
2. జ్యోతి ప్రజ్వళన
"నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగియుండును." (యోహాను 8:12).
అసతోమ సద్గమయా - తమ సోమ జ్యోతిర్గమయా - మృత్యోర్మ అమృతంగమయా (బృహదరణ్యక ఉపనిషత్తు)
ఈ జ్యోతి ప్రజ్వళన ద్వారా మనమంతా క్రీస్తు వెలుగును పొంది, సువార్త దీపికలు చేబూని అసత్యమునుండి
సత్యమునకు, చీకటినుండి వెలుగునకు, మరణమునుండి జీవమునకు, మన ప్రజలను నడిపించుటకు మనలను
అఖండ జ్యోతులుగా మార్చమని ప్రార్ధించుదాం.
The Light was lit by all the Bishops to invoke the light of Christ.
3. భజన
"దుప్పి నీటి వాగుల కొరకు ఆశ పడునట్లు దేవా! నీ కొరకు నా ప్రాణము ఆశ పడుచున్నది." (కీర్తన 42:1). "హంస తామర తూళ్ళనే తింటుంది. అందుకని పద్మాలతో నిండివున్న సరోవరాలకై పరితపిస్తుంది. చాతక పక్షి వాన చినుకులను మాత్రమే త్రాగుతుంది. అందుకే ఘన మేఘాలకై ఎదురు చూస్తుంది. నిజమైన భక్తుడు కూడా మోక్ష సాధకాలైన భగవంతుని పాదాలను పరితపిస్తాడు. అన్యములేవి అతనికి అక్కరలేదు (ఆది శంకరుడు).
జీవిత సర్వం నీవేగా - ఈశ్వరా సర్వేశ్వరా, నీటికై వెతికే దుప్పివలె దప్పిక గొన్నది నా యాత్మ
రా ... రా... రాజేశ్వరా "2" - నా దాహము తీర్చవా "2" "జీవిత"
4. పరిశుద్ధ గ్రంథ పఠనము – ధ్యానము
"నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడెను కనుక అది పడలేదు! మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ది హీనుని పోలి యుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ యింటి మీద కొట్టెను, అప్పుడది కూల బడెను. దాని పాటు గొప్పదని చెప్పెను" (మత్తయి 7:24-27).
ధ్యానము: వేరునుబట్టి చెట్టు, కనిపించని పునాదినిబట్టి ఇల్లు, లోతైన విశ్వాసాన్నిబట్టి ఆత్మరక్షణ ఆధార పడతాయని మనందరికీ తెలుసు. జడి వానలు, హోరు గాలి అనే శోధనల్లో, వెల్లువలనే కష్టాల్లో, అబద్దాల ఆటు పోట్లలో, ఈర్షతో నిండిన పుకార్ల సుడి గుండాల్లో మన రక్షణకోట కోతకు గురియవ్వటం అనివార్యం. పుట్టుక ఓ ఎత్తైతే, మరణము ఓ పల్లం. మొదలెట్టిన ఈ జీవిత ప్రవాహము ఆప ఎవరితరం. ప్రాణమో చిరుదీపమైతే, మేడమిద్దెల్లో ఉన్న, పూరి గుడిసెల్లో ఉన్న, రాజువైన, కూటికేడ్చే కూలియైన, మరణపు హోరుగాలికి ఆరిపోక తప్పదు. కాని, ఆధ్యాత్మిక పరిణితి చెందిన ప్రతి ఒక్కరు బావితరానికి పునాదిరాళ్ళు. భవనపు భారమంతా భూతల్లి గర్భపునాదిపై అన్నట్లు, సంఘ భారమంతా సంఘసేవకుల సహనముపైనే. ఆదరా బాదర బ్రతుకులు, అనుమానపు అంతుచిక్కని ప్రశ్నల గందర గోళంలో నెట్టుకు వెళ్తున్న బెండు లాంటి తేలిక సేవకులు, వరదలు వెల్లువలై పారినప్పుడు చిందర చిందర అవుతూ, అంతు లేకుండా కొట్టుకుపోతారు. కాని, దీక్షకలిగి, విలువలకి, సిద్ధాంతాలకి వెన్నుచూపని నాయకులు భవితకు బాటలు వేస్తారు. మనుగడకు మైలురాళ్ళు అవుతారు. ముసి ముసి నవ్వుల పౌడర్ పూసుకొని మతమనే ముసుగు మాటున రాజ్య మేలే చోర చక్రవర్తులు, మన సంఘములో లేకపోలేదు. కాని, అంతకు మించి, అలుపెరగక, అహరహం కార్య దీక్ష కొనసాగించి నమ్మిన బంటులు మన సంఘములో ఎందరో ఉన్నారు. అందుకే, మన సమావేశాలు, ప్రార్ధనలు, ఉద్యమాలై ఉజ్వల భవిష్యత్తుకు ఊత మివ్వాలని, సేవకులు స్ఫూర్తి పొందాలని ప్రేమతో ప్రార్దన చేద్దాం.
5. విశ్వాసుల ప్రార్థన
1. ప్రేమగల యేసువా! జగద్గురువులైన పదహారవ బెనడిక్టు పాపుగారిని, ఆయురారోగ్యములతో కాపాడమని, ప్రపంచ శాంతి సాధనలో తనకు తోడుగా పవిత్రాత్మను పంపమని, ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి.
2. ఓ ప్రభువా! అపోస్తుల వారసత్వములో వున్న మా సమస్త పీఠాధిపతులకు, మరి ముక్యముగా అఖిలాంధ్ర పీఠాధిపతులను పేరు పేరున మీ చల్లని దీవెనలతో నింపమని, ఆంధ్ర తిరుసభకు ఎడతెగక వారు చేస్తున్న కృషిని ఫలింపచేయమని, వారి సాధక బాధల్లో తోడుగా నీడగా ఉండమని, ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి.
3. ఓ ప్రభువా! మా ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న గురువులను, మఠకన్యలను, ఉపదేశకులను, సంఘ శ్రేయస్సుకై పాటుపడుతున్న ప్రతి దైవ సేవకులను నిండుగా మెండుగా దీవించమని, ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి.
4. ఓ ప్రభువా! మా కధోలిక కుటుంబాలను దీవించమని, ముఖ్యముగా, మా దైవ సేవకుల కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించమని, శాంతి సమాధానాలతో, ఐకమత్యముతో వెలుగొందునట్లు చేయుమని, ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి.
5. ఓ ప్రభువా! ఇక్కడ, రోమానగరములో, ఇటలీ దేశములో, చదువుతూ, పని చేస్తున్న మా తెలుగు గురువులను, మఠకన్యలను, గురు విద్యార్థులను, సామాన్య క్రైస్తవులందరిని కంటికి రెప్పలా కాపాడమని, ఆశయ సాధనలో గుండె చెదరక, ఒకరికి ఒకరు తోడై ఉండునట్లు, ఐక మత్యముతో, ప్రేమ ఆప్యాయాలతో నింపమని, ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి.
6. ముగింపు ప్రార్థన
కృపగల దేవా, దయగల తండ్రీ! ఈ సంవత్సరం ఆఖరి సమావేశానికి విచ్చేసిన ప్రతి తెలుగు సంఘసభ్యులను, మరి ముఖ్యముగా సుదూరమునుండి మమ్ము ప్రోత్సహింప వచ్చిన మేత్రాణులను దీవించమని వేడుచున్నాం. రోజురోజుకు మాలో అభివృద్ధిని, స్వీయపరిణితిని, ప్రేమను, శాంతిని నింపమని, అనేక కార్యక్రమాలు చేయుటకు మీ ఆత్మప్రేరణను దయ చేయమని, మా నాథుడును, మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రీ. ఆమెన్.
మరియతల్లి గీతం
సద్గుణ రాశి ఓ మరియ తల్లి - సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం
అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా "2" "సద్గుణ"
పరలోక దూతలు నిన్ను పొగడగ
ధరయందు జనులు నుతియించగా
మనుజాలి అంతటిలో మాన్యు రాలవు
మార్గము చూపెడి దేవ మాతవు “2” "సద్గుణ"
కానాను విందుకు నిన్ను పిలువగా
శ్రీ యేసుతో నీవు ఎతెoచితివి “2”
మా బాధలు తొలగించగ వేడుము మాతా
అవనిలో యేసుతో నడుపుము తల్లి “2” "సద్గుణ"
7. మేత్రాణుల దీవెనలు:
Bp. Thumma Bala, Arch-bishop of Hyderabad gave his solemn blessing upon all the members.
ఇతర కార్యక్రమాలు
1. తెలుగుసంఘ అధ్యక్షుల ఆహ్వాన పలుకులు - మేత్రాణుల సన్మానము
Fr. Johannes G., President of Telugu Sangham welcomed all the Bishops and the members of Telugu Sangham. All the Bishops were felicitated with a flower bouque.
2. మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు,
మా తెలుగు తల్లికి మల్లెపూదండ,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ “2”
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.
మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు,
మా తెలుగు తల్లికి మల్లెపూదండ,
1. గలగలా గోదారి కదలిపోతుంటేను “2”
బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను - బంగారు పంటలే పండుతాయీ “2”
మురిపాల ముత్యాలు దొరులుతాయి.
మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు,
మా తెలుగు తల్లికి మల్లెపూదండ,
2. అమరావతినగర అపురూప శిల్పాలు “2”
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు “2”
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు,
మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు,
మా తలుగు తల్లికి మల్లెపూదండ,
3. రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి “2”
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి -మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక “2”
నీ ఆటలే ఆడుతాం, నీపాటలే పాడుతాం
మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు,
మా తెలుగు తల్లికి మల్లెపూదండ…
3. స్వీయ పరిచయము
Each member gathered on the occasion introduced themselves.
4. మేత్రాణుల సందేశం
Bp. Thumma Bala, arch-bishop of Hyderabad gave his valuable message.
5. తెలుగుసంఘ అధ్యక్షుల సందేశం
Fr. Johannes G., President of Telugu Sangham thanked the Bishops for their presence and all the members for their participation.
6. గ్రూప్ ఫోటో (Group Photo)
9. సహపంక్తి విందు
Write it on your heart that every day is the best day in the year."-- Ralph Waldo Emerson
"When we once begin to form good resolutions, God gives us every opportunity of carrying them out."-- St John Chrysostom
Dear Fathers , Brothers and Sisters, I take this opportunity on behalf of Telugu Sangham to wish you all A VERY HAPPY AND PROSPEROUS NEW YEAR 2011.
Fr.Johannes. G
President, Telugu Sangham, Rome, ITALY
Friday, 29 April 2011
Saturday, 1 January 2011
Subscribe to:
Posts (Atom)